టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్….. కన్నీరు పెట్టుకున్న తండ్రి

-

ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేశారు. ఈ క్రమంలో సర్ఫరాజ్కు మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే క్యాప్ అందించారు. ఇది చూస్తూ పక్కనే ఉన్న సర్ఫరాజ్ తండ్రి భావోద్వేగానికి లోనయ్యారు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ అవుతోండగా.. ఇలాంటి క్షణాలే క్రికెట్ను మరింత అందంగా మారుస్తాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సర్ఫరాజ్ తో పాటు ధ్రువ్ జురెల్ ఎంట్రీ ఇచ్చారు.

టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ నెగ్గిన టీమ్ ఇండియా జట్టు… మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఇంగ్లాండ్ జట్టు మొదట బౌలింగ్ చేయనుంది.ఈ మ్యాచ్ రాజ్కోట్ వేదికగా జరుగుతోంది.

 

ఇండియా (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(సి), శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్(w), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

Read more RELATED
Recommended to you

Latest news