జక్కన్న షాకింగ్ డెసిషన్​.. SSMB 29 టైటిల్ ఛేంజ్​.. కొత్త పేరేంటంటే?

-

SSMB 29 వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. అమెజాన్ ఫారెస్ట్ అండ్ యాక్షన్ అడ్వెంచర్ బ్యాక్డ్రాప్తో ఈ సినిమాను దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి పాన్ వరల్డ్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత జక్కన్న తీస్తున్న సినిమా కావడం, అందులోనూ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరో కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గురించి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ సూపర్ అప్డేట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే సినిమా వర్కింగ్ టైటిల్ ను మార్చబోతున్నారట. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను మొదటి నుంచి SSMB29 అని పిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ SSMB29ను SSRMBగా మార్చబోతున్నారని టాక్ వినిపిస్తోంది.  రాజమౌళి క్రేజ్ గురించి తెలిసిందే కదా. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన పాపులారిటీ ప్రపంచ వ్యాప్తంా కావడంతో  ఈ వర్కింగ్ టైటిల్ను మార్చబోతున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news