SarkaruVaariPaata : సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ”సర్కారు వారి పాట”.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే..

-

టాలీవుడ్‌ స్టార్‌ హీరో, ప్రిన్స్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాకు టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ అండ్ మాస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు… మహానటి కీర్తిసురేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా కు నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది ఇలా ఉండగా సర్కారు వారి పాట సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం.

వచ్చే ఏడాది అంటే..ఉగాది కానుకగా ఏప్రిల్‌ 1 వ తేదీన సర్కారు వారి పాట సినిమాను విడుదల చేయనున్నట్లు అఫిషీయల్‌ గా ప్రకటించింది చిత్ర యూనిట్‌. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా వదిలింది. కాగా.. గతంలో సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. సంక్రాంతికి వరుసగా సినిమా ఉండటంతో.. ఏప్రిల్‌ కి షిఫ్ట్‌ అయింది సర్కారు వారి పాట.

 

Read more RELATED
Recommended to you

Latest news