విజయగర్జన సభ వివాదంపై టీఆర్‌ఎస్‌ క్లారిటీ..అన్ని ఆబండాలే !

-

ఈ నెల 29 వ తేదీన వరంగల్‌ జిల్లాలో విజయగర్జన సభ నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే ఇవాళ విజయగర్జన సభ కోసం.. హన్మకొండ జిల్లా లోని హసన్ పర్తి మండలం దేవన్నపేటలో స్థలం పరిశీలించారు అక్కడి స్థానిక టీఆర్ఎస్ నేతలు. టీఆర్‌ఎస్‌ పార్టీ మీటింగ్ కోసం పంట పండే తమ పొలాలను ఇచ్చేది లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. దీంతో టీఆర్‌ఎస్‌ మరియు రైతుల మధ్య వివాదం తలెత్తింది.

అయితే.. ఈ వివాదంపై టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ క్లారిటీ ఇచ్చారు. త్యాగాల పునాదుల మీద సీఎం కేసీఆర్ తెరాస పార్టీ ని ఏర్పాటు చేసి 20 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో నవంబర్ 29 దీక్షదివస్ ను నిర్వహించుకుంటున్నాం…. ఈ సారి వరంగల్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నామని ప్రకటించారు.

10 లక్షల ప్రజలతో సభను నిర్వహిస్తామని… సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. సభ కోసం మూడు స్థలాలను పరిశీలిస్తున్నామని… ప్రజల అంగీకారంతో బహిరంగ సభను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 29 వ తేదీన దీక్ష దివాస్ సందర్భంగా వరంగల్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. తెరాస, సీఎం కేసీఆర్ అంటే గిట్టని వాళ్ళు లేనిపోని ఆబండలు వేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు ఇబ్బంది లేకుండానే సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు దాస్యం వినయ్ భాస్కర్.

Read more RELATED
Recommended to you

Latest news