అప్పుడు చంద్రబాబు…ఇప్పుడు కేసీఆర్..గొయ్యి తవ్వుకున్నట్లే!

-

ఒక మంత్రి పదవి…ఒకే ఒక్క పదవి…తెలుగుదేశం పార్టీ భవిష్యత్‌నే మార్చేసిందనే చెప్పాలి. 1999 ఎన్నికల్లో గెలిచి రెండోసారి సీఎం అయిన చంద్రబాబు….అప్పుడు టీడీపీలో కీలక నేతగా ఉన్న కేసీఆర్‌కు మంత్రి పదవి ఇవ్వలేదు. ఇక మంత్రి ఇవ్వకపోవడంతో కేసీఆర్..ఆ తర్వాత ఏం చేశారో రాష్ట్రానికి మొత్తం తెలుసు. అనూహ్యంగా తెలంగాణ ఉద్యమం పేరుతో….టీఆర్ఎస్ పార్టీ పెట్టి రాజకీయం మొదలుపెట్టారు. అయితే కేసీఆర్‌కు పార్టీ పెట్టడానికి సహకరించింది కూడా టీడీపీలోని కొందరు పెద్ద నాయకులే. ఆర్ధిక సాయం చేశారు. దీంతో కేసీఆర్ నిదానంగా ఎదుగుతూ వచ్చారు.

తెలంగాణ ఉద్యమాన్ని ఉదృతం చేశారు. అలాగే 2004లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లారు. ఆ తర్వాత 2009లో మళ్ళీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారు..కానీ ఎక్కడకక్కడే కేసీఆర్ రాజకీయంగా ఎత్తుగడలు వేస్తూ ముందుకొచ్చారు. చివరికి ప్రత్యేక రాష్ట్రం సాధించేవరకు వచ్చారు. అలాగే తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా కూడా అయ్యారు. ఆ తర్వాత రాజకీయ జన్మని ఇచ్చిన టీడీపీని తెలంగాణలో లేకుండా చేసేశారు. మళ్ళీ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చి తిరుగులేని నాయకుడుగా చెలామణి అవుతున్నారు. అంటే చంద్రబాబు చేసిన ఒక చిన్న మిస్టేక్….ఇంతవరకు వచ్చిందనే చెప్పాలి. అంటే పరోక్షంగా చెప్పాలంటే చంద్రబాబు….తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు అయింది.

అయితే అదే మిస్టేక్ ఇప్పుడు కేసీఆర్ చేసినట్లే కనిపిస్తోంది. తనతో పాటు 20 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతూ..ఉద్యమంలో కీలకంగా ఉంటూ, పార్టీ కోసం అండగా నిలబడుతూ వచ్చిన ఈటల రాజేందర్‌ని కేసీఆర్ ఏ విధంగా పార్టీ నుంచి బయటకు పంపారో అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే తాము కూడా కారు ఓనర్లమని ఈటల అన్నారో…అప్పటినుంచే ఆయన్ని బయటకు పంపే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. మళ్ళీ ఎక్కడ తన వారసుడు కేటీఆర్‌కు అడ్డంకిగా మారతారని అనుకున్నారేమో గానీ, ఆయన్ని సైడ్ చేసేశారు.

ఇక ఈటలని ఎలా బయటకు పంపారు…ఆయనపై ఎలాంటి ఆరోపణలు చేశారు..ఆయన పార్టీ నుంచి ఎలా బయటకొచ్చేశారు అనే ప్రతి విషయం జనాలకు తెలుసు. అనూహ్యంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి,బీజేపీలో చేరి, మళ్ళీ హుజూరాబాద్‌ బరిలో నిలబడి, కేసీఆర్ కుట్రలని తిప్పికొట్టి విజయం సాధించి…ఇప్పుడు కేసీఆర్‌కు యమపాశం మాదిరిగా తయారయ్యారు. కేసీఆర్‌కు పోటీగా సీఎం అయ్యే అర్హతలున్న నాయకుడుగా ఈటల ముందుకొచ్చారు. మరి రానున్న రోజుల్లో కేసీఆర్‌కు ఈటలతో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news