శశిధర్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు..

-

కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డికి ఢిల్లీ అధిష్ఠానం నుంచి పిలుపొచ్చింది. సనత్‌నగర్‌ స్థానాన్ని మహాకూటమి పొత్తుల్లో భాగంగా  తెదేపాకు కేటాయించడంతో శశిధర్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాను మాట్లాడుతూ… తాను పదవుల కోసం పాకులాడే రకం కాదని, గెలుపు కోసమే పొత్తులు పెట్టుకొంటే వాటికే కట్టుబడి ఉంటానని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్క్రీనింగ్‌ కమిటీలో మాట్లాడుతూ ‘శశిధర్‌ రెడ్డి గెలవలేరు’ అని వాదించారని ఆరోపించారు.

అదే నిజమైతే తాను చేసిన సర్వేల ఫలితంగా నేడు సీట్లు కేటాయింపు జరిగితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం లోపు పార్టీ హైకమాండ్‌ సనత్‌నగర్‌పై మరోసారి పునరాలోచన చేయాలని డిమాండ్‌ చేయగా..శనివారం సాయంత్రం ఢిల్లీ నుంచి శశిధర్‌రెడ్డికి ఫోన్‌ వచ్చింది. దీంతో ఆయన హస్తినకు పయనమయ్యారు. రాష్ట్ర  వ్యాప్తంగా టికెట్ దక్కని కొంత మంది ఇప్పటికే రెబెల్స్ గా బరిలోకి దిగుతుంటే…ప్రస్తుతం శశిధర్ రెడ్డి తిరుగుబాటుతో కాంగ్రెస్ కి మరో చిక్కువచ్చి పడటంతో అధిష్ఠానం తక్షణ చర్యలు తీసుకోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news