భారత్ లో సౌదీ అరేబియా మంత్రి పర్యటన..!

-

సౌదీ అరేబియా మంత్రి తౌఫిక్ బిన్ ఫౌజన్ అల్ రబియా భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇవాళ భారత కేంద్రం మైనార్టీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ మంత్రి తౌఫిక్ బిన్ ఫౌజన్ అల్ రబియా ను కలిశారు. ఈ నేపథ్యంలో స్మృతి ఇరానీ మీడియాతో మాట్లాడారు. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం గురించి మాట్లాడామన్నారు. అంతేకాదు.. హజ్ యాత్రను మరింత అందుబాటులోకి తీసుకురావడంపై కూడా చర్చించామని తెలిపారు.

అంతేకాదు.. అంగన్ వాడీ కేంద్రాలు ఎలా హైటెక్ గా మారుతున్నాయో.. టెక్నాలజీ ఎలా పనిని సులభతరం చేసిందో స్మృతి ఇరానీ వివరించారు. సాంప్రదాయ బొమ్మలు, లాలిపాటల ద్వారా చిన్నపిల్లలకు విద్యాబోధన చేయడం ఎందుకు ముఖ్యమో.. స్మృతి ఇరానీ తెలిపారు. సాంకేతికత, భారతీయ సంప్రదాయం సహాయంతో అంగన్ వాడీ కేంద్రాలు పిల్లలను తీర్చిదిద్దుతున్నాయని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. మరోవైపు హజ్ 2023ను విజయవంతం చేసేందుకు సౌదీ అరేబియాకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ కృతజ్ఞతలు తెలిపారు. హజ్ 2024ను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి తౌఫిక్ బిన్ ఫౌజన్ అల్ రబియా భారత్ పర్యటన ముఖ్యం అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news