దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. పైగా పిల్లల కోసం రెండు రకాల సేవింగ్స్ అకౌంట్లను కూడా అందిస్తోంది స్టేట్ బ్యాంక్. ‘పెహ్లా కదమ్’, ‘పెహ్లి ఉడాన్’ పేర్లతో వీటిని అందిస్తోంది. ఈ అకౌంట్ ని ఓపెన్ చేయాలంటే జీరో బ్యాలెన్స్ తో చెయ్యచ్చు.
ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్‌లను మెయింటైన్ చెయ్యక్కర్లేదు. బ్యాంకు అకౌంట్లలో గరిష్టంగా రూ.10 లక్షల వరకు డిపాజిట్ చెయ్యవచ్చు. పైగా ఈ అకౌంట్లు నెట్ బ్యాంకింగ్‌ను, మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని కూడా ఇస్తున్నాయి.
పెహ్లా కదమ్, పెహ్లి ఉడాన్ రెండూ పిల్లలకి కొనుగోలు శక్తిని తెలియడానికి పిల్లలకు మనీ పొదుపు గురించి అవగాహన కల్పించడానికి హెల్ప్ చేస్తాయి. ఈ అకౌంట్స్ అన్ని రకాల ఫీచర్స్ తో వస్తున్నాయి.
పెహ్లా కదమ్ : మైనర్ పిల్లల కోసం దీన్ని ఓపెన్ చెయ్యచ్చు. పేరెంట్ లేదా గార్డియన్‌తో జాయింట్ అకౌంట్ ఓపెన్ చెయ్యచ్చు. చెక్ బుక్‌లు తీసుకొచ్చు. పిల్లల ఫోటోతో ఏటీఎం కమ్ డెబిట్ కార్డును ఇస్తున్నారు. దీని విత్ డ్రాయల్ లిమిట్ రూ.5 వేలు. రోజుకు రూ.2 వేల ట్రాన్సక్షన్స్ చెయ్యచ్చు.
పెహ్లి ఉడాన్: సొంతంగా సంతకం చేయగలిగే పదేళ్ల పైబడిన మైనర్లు ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. పర్సనలైజ్డ్ చెక్‌బుక్‌ను కూడా వస్తుంది. మైనర్ పేరుతో, వారి ఫోటోతో డెబిట్ కార్డును కూడా ఇస్తారు. పిల్లలు బిల్లు పేమెంట్లు, టాప్ అప్‌లు, ఐఎంపీఎస్ చేసుకోవచ్చు. దీని విత్ డ్రాయల్ లిమిట్ రూ.5 వేలు. రోజుకు రూ.2 వేల ట్రాన్సక్షన్స్ చెయ్యచ్చు.