SBI: మార్చి 31 వరకే ఈ స్కీమ్ లో అవకాశం..!

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ‘ఎస్‌బీఐ వీకేర్’ తీసుకు వచ్చింది. స్కీమ్ గడువు 2020 డిసెంబర్ 31న ముగిసింది. అయితే కానీ డబ్బులు దాచుకోవాలనుకునే వారికి మరో సారి అవకాశం ఇవ్వడానికి ఈ స్కీమ్ గడువును 2021 మార్చి 31 వరకు పొడిగించింది ఎస్‌బీఐ. కనుక వీకేర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఓపెన్ చెయ్యాలంటే అవకాశం ఉంది.

కనుక ఎవరైనా ఆసక్తి ఉంటే అప్లై చేసుకోవచ్చు. సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ల లో కంటే ‘ఎస్‌బీఐ వీకేర్’ ఫిక్స్‌డ్ డిపాజిట్ ద్వారా వృద్ధులు 0.80 శాతం వడ్డీ అధికంగా పొందొచ్చు. అలానే సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల కన్నా సీనియర్ సిటిజన్లకు అరశాతం అంటే 0.50 శాతం వడ్డీని అధికంగా ఇస్తోంది.

‘ఎస్‌బీఐ వీకేర్’ ఫిక్స్‌డ్ డిపాజిట్ ద్వారా 0.30 శాతం అధికంగా వడ్డీ పొందొచ్చు ‘ఎస్‌బీఐ వీకేర్ డిపాజిట్’ స్కీమ్‌ ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. అయితే వయస్సు 60 ఏళ్ల పైనే ఉండాలి గమనించండి. ఇది ఇలా ఉంటే భార్యాభర్తలు ఇద్దరూ సింగిల్ అకౌంట్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు లేదు అంటే జాయింట్ అకౌంట్ అయినా చెయ్యొచ్చు. నామినేషన్ సదుపాయం కూడా ఉంది.

ఇందులో కనీసం 5 ఏళ్లు డిపాజిట్ చేయాలి.ఇందులో కనీసం రూ.1,000 డిపాజిట్ చేయొచ్చు. ఇలా ఇందులో రూ.15,00,000 వరకు డిపాజిట్ చేయొచ్చు. ఒకవేళ ఐదు ఏళ్ళు పూర్తై పోతే మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. అలానే ఆదాయపు పన్ను మినహాయింపులు ఏవీ వుండవు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఎస్‌బీఐ ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 5.4 శాతం వడ్డీ ఇస్తోంది. ఎస్‌బీఐ వీకేర్ డిపాజిట్ స్కీమ్ ‌లో డబ్బులు డిపాజిట్ చేస్తే 6.2 శాతం వడ్డీ పొందొచ్చు. ఒకవేళ ఐదేళ్ల కన్నా ముందే డబ్బులు డ్రా చేస్తే 5.9 శాతం వడ్డీ మాత్రమే లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news