గత మూడు రోజులుగా దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా కస్టమర్లు చాలా బాధపడుతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే.. SBI కు లింక్ అయిన ఫోన్ పే లు కానీ, జి పే లు కానీ ట్రాన్సాక్షన్ కు సహకరించడం లేదు కదా, కనీసం బాలన్స్ లు కూడా చూడడానికి వీలు పడకుండా ఉంది. ప్రజలకు అందుబాటులో ఉన్న బ్యాంక్ లలో కల్లా దిగ్గజంగా పేరున్న SBI ఈ విధమైన సేవలను ఇస్తుందంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఈ అంతరాయాలు జరుగుతాయని టెక్నాలజీ అప్డేట్ చేస్తున్నామని అక్టోబర్ 14వ తేదీన SBI ప్రకటించినా ఎప్పుడు మళ్ళీ యాధస్థితికి వస్తాయన్న విషయం మాత్రం చెప్పలేదు. ఈ విషయంపై తీవ్రంగా ఆందోళన చెందుతున్న SBI కస్టమర్లు వారికి ఫైన్ వేయాలంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ప్రజల అవసరాన్ని SBI గుర్తించి వెంటనే సమస్యను పరిష్కరించి ఎప్పటిలాగే సేవలు ఎటువంటి అంతరాయం కలుగకుండా చూస్తారా చూడాలి.