చంద్రబాబు పోతే.. టీడీపీని కలుపుకుద్దామని పవన్‌ చూస్తున్నారు : వెల్లంపల్లి

-

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై నిరసనలు వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు.. ఆయన ఆరోగ్యంపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీకి అనుమానం ఉంటే కోర్టుకు వెళ్లాలని సూచించారు. సంకేళ్లు వేసుకోవడం ద్వారా తమకూ సంకేళ్లు వేయాలని టీడీపీ పిలుస్తోందని ఎద్దేవా చేశారు వెల్లంపల్లి శ్రీనివాస రావు. టీడీపీ తలపెట్టిన న్యాయానికి సంకేళ్లు కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన లేదన్నారు. రోజుకు 24 గంటలు ఉంటే కేవలం ఐదు నిమిషాలు మాత్రమే కార్యక్రమానికి పిలుపునివ్వడం సిగ్గుచేటు అన్నారు వెల్లంపల్లి శ్రీనివాస రావు.

Vellampalli srinivas: ఇంద్రకీలాద్రిపై ఎమ్మెల్యే వెల్లంపల్లి హల్‌చల్ | ycp  mla vellampalli srinivas vijayawada andhrapradesh suchi-MRGS-AndhraPradesh

చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691 ద్వారా కోర్టు పరిదిలో ఉన్నారన్నారు. ఆయన ఆరోగ్యంపై అనుమానం ఉంటే కోర్టుకు వెళ్లాలని, కోర్టు పరిధిలోకి వెళ్లాక ప్రభుత్వం ఏం చేయలేదన్నారు. చంద్రబాబుకు ప్రయివేటు వైద్యం కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు అడగడం లేదన్నారు. పవన్ షూటింగ్స్‌తో ఫామ్ హౌస్‌లో బిజీగా ఉంటాడన్నారు. చంద్రబాబు మీద జనసేనాని మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. చంద్రబాబు ఎప్పుడు పోతాడా? ఎప్పుడు టీడీపీని జనసేనలో కలుపుకుంటామా? అని తాపత్రయపడుతున్నారని ఆరోపించారు.

అంతేకానీ చంద్రబాబు మీద పవన్‌కు ఏమాత్రం ప్రేమ లేదన్నారు. టీడీపీ వాళ్లని చూసి వాళ్ల కేడరే నవ్వుకుంటోందన్నారు. చంద్రబాబు ఉక్కు సంకల్పం ఉన్న మనిషి కాదని, తప్పుడు మనిషి అన్నారు. ముప్పై రోజులకే చంద్రబాబు తుప్పు బయటపడిందన్నారు. ఆయనకు లేని రోగం లేదంటూ కుటుంబ సభ్యులే దేశమంతా ప్రచారం చేస్తున్నారన్నారు. ఆయనకు ఉన్న రోగాలు ఈ నెల రోజుల్లో వచ్చినవి కాదని, ఆయన ఎందుకూ పనికిరాడని కుటుంబ సభ్యులే చెబుతున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news