సీనియర్​ సిటిజన్లకు ఎస్​బీఐ గుడ్ ​న్యూస్​.. పెన్షన్​ సేవ పోర్టల్​ ప్రారంభం..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్లకు గుడ్​న్యూస్​ చెప్పింది. ఇక వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొత్త పెన్షన్ సేవలను తీసుకు వచ్చింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. సేవలు పొందాలనుకునే సీనియర్​ సిటిజన్​ కస్టమర్లు ముందుగా అవసరమైన సమాచారంతో పోర్టల్​లో రిజిస్టర్​ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్​ చేసుకున్న కస్టమర్లు ఈ సేవలను సులభంగా పొందవచ్చని ఎస్​బీఐ తాజాగా ఓ ట్వీట్​ చేసింది.

 

SBI
SBI

ఇక పోర్టల్ వివరాల లోకి వెళితే .. ఈ కొత్త పెన్షన్​ సేవల కోసం ప్రత్యేకంగా https://www.ptensionseva.sbi పోర్టల్​ను అందుబాటులోకి తెచ్చింది. వివిధ రకాల సేవలను ఖాతాదారులు దీనితో పొందొచ్చు. దీని ద్వారా బకాయిల లెక్కింపు షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం, పెన్షన్ స్లిప్ లేదా ఫారం -16ని డౌన్‌లోడ్ చేసుకోవడం లాంటివి అవుతుంది. అదే విధంగా మరెన్నో సేవలని ఈజీగా పొందొచ్చు. ఫోన్​లో పెన్షన్ చెల్లింపు వివరాలకు సంబంధించిన అలర్ట్​లను కూడా పొందొచ్చు.

ఒక్కసారి రిజిస్టర్​ చేసుకుంటే చాలు ప్రతినెలా మీ పెన్షన్​ స్లిప్​ను నేరుగా రిజిస్టర్డ్ ఈ–మెయిల్ కి వస్తుంది. ఒకవేళ కనుక రిజిస్టర్​ చేసిన తర్వాత ఏదైనా సమస్యలు వస్తే [email protected] కు ఈ–మెయిల్ చేయవచ్చు. లేదంటే ‘SMS UNHAPPY’ అని టైప్ చేసి 8008202020 నెంబర్​కు SMS చేసి సమస్యని పరిష్కరించుకోచ్చు. లేదు అంటే 18004253800/1800112211, 08026599990 టోల్​ఫ్రీ నెంబర్ల కు కాల్ చేసి కూడా చెప్పచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news