ఇండియా కరోనా అప్డేట్… కొత్తగా 27176 కేసులు

-

ఇండియాను కరోనా మహమ్మారి వదిలేలా లేదు. ఇవాళ మరోసారి కరోనా కేసులు భారీగా పెరిగాయి. నిన్నటి రోజున తగ్గిన కరోనా కేసులు…ఇవాళ మాత్రం కాస్త పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 27,176 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,33,16,755 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,51,087 కు చేరింది.

ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.79 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 284 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 4,43,497 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 38, 012 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 75,89,12,277 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో మాత్రం 61,15,690 మందికి వ్యాక్సిన్‌ వేసింది ఆరోగ్య శాఖ. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,25,22,171 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news