జగన్, విజయసాయి బెయిల్ రద్దుపై నేడు తుది తీర్పు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పై గత కొన్ని రోజులుగా సందిగ్థత నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరియు వైసీపీ రాజ్య సభ సభ్యులు విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై నేడు తుది తీర్పు చెప్పనుంది సీబీఐ కోర్ట్ . ఇప్పటికే వాదనలు ముగియగా.. నేడే తుది తీర్పును సీబీఐ కోర్ట్ వెల్లడించునుంది.

jagan

ఇక అటు ఏపీ సిఎం జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్‌ మరో కోర్టు కు బదిలీ చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర హై కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు వైసపి రెబల్ ఎంపీ రఘు రామకృష్ణ రాజు. బెయిల్ రద్దు పిటిషన్ పై సిబీఐ కోర్టు ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు ఎంపీ రఘు రామకృష్ణ రాజు. అటు తెలంగాణ హైకోర్టు లోనూ ఈ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఇక ఈ పిటిషన్ పై నేడు హై కోర్టు కూడా తీర్పు ను వెల్లడించునుంది. దీంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.