ఎస్బీఐలో 5008 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

-

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 5008 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ అర్హతతో వీటికి పోటీ పడవచ్చని తెలిపింది. రాష్ట్రాలవారీగా ఖాళీలను భర్తీ చేస్తున్నారు కాబట్టి ఏ రాష్ట్రం నుంచి దరఖాస్తు చేస్తే ఆ రాష్ట్రంలోనే విధులు నిర్వహించాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. ఇవి క్లరికల్‌ క్యాడర్‌ పోస్టులు కావడం వల్ల దరఖాస్తు చేసిన రాష్ట్రంలోనే పనిచేయాలని స్పష్టం చేసింది. ఆఫీసర్‌గా పదోన్నతి పొందిన తర్వాత.. జాతీయ స్థాయి క్యాడర్‌ కిందికి వస్తాయని వెల్లడించింది. అప్పుడు రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశంలో ఎక్కడైనా పనిచేసే అవకాశం వస్తుందని చెప్పింది.

జూనియర్‌ అసోసియేట్‌ పరీక్షను మొదటిసారిగా ప్రాంతీయ భాషలో నిర్వహిస్తున్నారు. ఇంగ్లిష్‌, హిందీపాటు తెలుగు, ఉర్దూల్లోనూ పరీక్ష రాయొచ్చు. తెలుగును ఎంచుకుంటే ఇంగ్లిష్‌, తెలుగులో, ఉర్దూను ఎంచుకుంటే ఇంగ్లిష్‌, ఉర్దూలో పరీక్ష ఉంటుంది. ఈ ఏర్పాటు అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరం.

ఆన్‌లైన్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), స్థానిక భాష పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. ప్రిలిమ్స్‌ అనేది అర్హత.

Read more RELATED
Recommended to you

Latest news