స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. రక్షా బంధన్ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫర్లని ప్రకటించింది. ఇక SBI Raksha Bandhan | YONO SBI APP offer కోసం పూర్తి వివరాలలోకి వెళితే..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో యాప్ ద్వారా షాపింగ్ చేస్తే 20 శాతం డిస్కౌంట్ ని కస్టమర్స్ కి ఇస్తోంది. అయితే కరోనా నేపథ్యంలో ఆన్లైన్ షాపింగ్ ని ప్రోత్సహించాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఆఫర్లకి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. ఫెర్న్స్ యన్ పెటల్స్ నుండి కొనుగోలు చేస్తే కస్టమర్లు 20 శాతం వరకు డిస్కౌంట్ వస్తుంది. అయితే యోనో యాప్ ద్వారా షాపింగ్ చేసిన వారికి మాత్రమే ఈ అవకాశం.
అలానే జీవన్‌శైలి స్టోర్.కామ్ నుండి వస్తువుల కొనుగోలుపై కూడా 60% వరకు తగ్గింపు అందుకోవ్చని SBI తెలిపింది. అదే విధంగా లగ్జరీ వస్తువులు, ఫ్యాషన్ వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. యోనో యాప్ ద్వారా చెల్లింపులు చేస్తే 5 శాతం డిస్కౌంట్ అందుకోవచ్చని ఎస్బీఐ తెలిపింది.
ఒకవేళ ఈ ఆఫర్స్ గురించి సందేహాలు ఉంటే SBI YONO, sbiyono.sbi అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఎస్బీఐ సూచించింది. యోనో SBI యాప్ లేని వారు sbiyono.sbi/index.html ఈ లింక్ తో యాప్ ను డౌన్ లోడ్ చెయ్యచ్చు. ఆగస్టు 22 వరకు మాత్రమే ఈ అఫర్ ఉంటుంది. SBI20 కోడ్ ఉపయోగించి షాప్ చేస్తే డిస్కౌంట్ ఉంటుంది.