మీరు SBI కస్టమరా? మీ డేటా సురక్షితంగా ఉందో లేదో చెక్ చేసుకోండి

-

మీరు ఎస్బీఐ కస్టమరా? అయితే.. మీ ఖాతాకు సంబంధించిన డేటా సురక్షితంగా ఉందో చెక్ చేసి చూసుకోండి. ఎందుకంటే.. ఎస్బీఐకి చెందిన కస్టమర్ల డేటా ఉన్న సర్వర్ల నుంచి డేటా లీక్ అయిందట. దీంతో లక్షల మంది ఎస్బీఐ కస్టమర్ల సెన్సిటివ్ డేటా ఆన్ లైన్ లీక్ అయినట్టు సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ.. టెక్ క్రంచ్ వెల్లడించింది. కస్టమర్ల డేటా ఉన్న సర్వర్ కు బ్యాంకు సిబ్బంది పాస్ వర్డ్ సెట్ చేయడం మరిచిపోవడంతో సర్వర్ నుంచి డేటా లీకయినట్టు టెక్ క్రంచ్ తెలిపింది. ఎస్బీఐ క్విక్ పేరుతో నిర్వహిస్తున్న అప్లికేషన్ కు లింక్ అయిన సర్వర్ డేటానే లీక్ అయింది. అయితే.. ఈ లోపాన్ని సరిదిద్దినప్పటికీ.. ఇప్పటి వరకు లీకైన డేటా సంగతి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఎస్బీఐకి మొత్తం 50 కోట్ల మంది కస్టమర్లు ఉండగా.. వీళ్లలో ఎంత మంది డేటా లీక్ అయిందనే దానిపై స్పష్టత లేదు. ఒకవేళ ఈ డేటా సైబర్ క్రిమినల్స్ కు దొరికితే.. వాళ్లు ఎస్బీఐ కస్టమర్ల అకౌంట్లను హ్యాక్ చేసే అవకాశం ఉన్నట్టు సైబర్ నిపుణులు తెలుపుతున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వాడుతున్న కస్టమర్లు వెంటనే తమ పాస్ వర్డ్స్ ను మార్చుకుంటే కొంతవరకైనా సైబర్ క్రైమ్ ను తగ్గించవచ్చని నిపుణులు సలహాలు ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news