ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. దిగివచ్చిన హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు

-

ఇటీవలే ఆర్బీఐ రెపో రేటును తగ్గించడంతో.. ఎస్బీఐ తన రుణ రేట్లను తగ్గించింది. దీంతో ఎంసీఎల్ఆర్ తో అనుసంధానమైన రుణాల వడ్డీ రేట్లన్నీ దిగివస్తాయి. ప్రస్తుతం ఎంసీఎల్ఆర్ 8.45 శాతంగా ఉంది.

భారతదేశంలోనే అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తన కస్టమర్లకు తీపి కబురు అందించింది. హోమ్ లోన్స్ తీసుకునే తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. బెంచ్ మార్క్ లెండింగ్ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఎంసీఎల్ఆర్ రుణ రేట్లలో 0.05 శాతం తగ్గింపు ఈరోజు నుంచే అమలులోకి రానుందని ఎస్బీఐ ప్రకటించింది.

ఇటీవలే ఆర్బీఐ రెపో రేటును తగ్గించడంతో.. ఎస్బీఐ తన రుణ రేట్లను తగ్గించింది. దీంతో ఎంసీఎల్ఆర్ తో అనుసంధానమైన రుణాల వడ్డీ రేట్లన్నీ దిగివస్తాయి. ప్రస్తుతం ఎంసీఎల్ఆర్ 8.45 శాతంగా ఉంది. ఇప్పుడు తగ్గిన రేట్లతో కలిపితే 8.4 శాతంగా అవుతుంది.

ఎంసీఎల్ఆర్ తగ్గింపును ఇప్పుడు లెక్కలోకి తీసుకుంటే.. ఏప్రిల్ 10 నుంచి ఎస్బీఐ హోమ్ లోన్స్ పై వడ్డీ రేట్లపై 20 బేసిస్ పాయింట్లు తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేట్ల తగ్గింపు ఇది మూడోసారి.

Read more RELATED
Recommended to you

Latest news