మారిటోరియం మీద ఏమీ తేల్చని కేంద్రం.. వడ్డి పై వడ్డి తప్పదా ?

-

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ, వడ్డీపై వడ్డీ వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. మారిటోరియం సమయంలో రుణాలపై వడ్డీ, వడ్డీ పై వడ్డీ వసూలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలపడానికి మరొక రెండు మూడు రోజులు సమయం కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు.

రుణాలపై వడ్డీ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ప్రక్రియ తుది దశలో ఉందని సుప్రీం కోర్టుకు సొలిసిటర్ జనరల్ తెలిపారు. దీంతో ఈ కేసు విచారణను వచ్చే సోమవారానికి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. రుణాలు తిరిగి చెల్లించడంపై విధించిన మారిటోరియాన్ని పొడిగించాలని అలానే కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని రుణ మొత్తం మీద విధించిన వడ్డీని వదులు కోవాలని కోరుతూ గజేంద్ర శర్మ మరియు న్యాయవాది విశాల్ తివారీ దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీం కోర్టు విచారించింది. అయితే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే విషయంలో రెండ్రోజుల సమయం కోరడంతో సోమవారానికి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news