ఓరేయ్ బుజ్జిగా ట్రైలర్ విడుదల..!

రాజ్ తరుణ్ హిట్ కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలు అన్నీ ఫట్ అంటుంటే పూర్తి నిరాశలో మునిగిపోయాడు. కానీ ఇండస్ట్రీలో అడగు పెట్టినప్పుడు మాత్రం వరుస విజయాలు సాధించాడు. ఇప్పుడు ఓరేయ్ బుజ్జిగా అంటూ ప్రేక్షకులను పలకరించుందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ కు జోడీగా హెబ్బా పటేల్, మాళవిక నాయర్ లు నటించారు. కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె.కె. రాధామోహన్‌ నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమాలోని ట్రీజర్, ట్రైలర్ చూస్తుంటే ఈ సారి రాజ్ తరుణ్ హీట్ ఖాయమనే అనిపిస్తుంది. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, నరేష్, సప్తగిరి, అజయ్‌ ఘోష్ తదితర సీనియర్లతో పాటు మరికోంత కమెడీయన్ నటిస్తున్నారు. నాదొక బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్ మార్వలెస్ లవ్ స్టోరీ అనే డైలాగ్ ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్తుందని అందరూ అనుకుంటున్నారు. అప్పటి హీరోయిన్ వాణీ విశ్వనాథ్‌ ప్రత్యేక పాత్రలో నటించినున్నట్లు తెలిసింది. సినిమా ఎలా దూసుకోపోతుందో తెలుసుకోవాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే…