అయ్యన్నపాత్రుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

తెలుగు దేశం సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి వర్యులు అయ్యన్నపాత్రుడు..ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జగన్‌ సర్కార్‌ మరియు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హోం మినిస్టర్‌ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర రాజ కీయాలు ఒక్క సారిగా భగ్గుమన్నాయి.

ఈ నేపథ్యం లోనే.. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుకి వ్యతిరేకంగా…. వైసీపీ నాయకులు మరియు మంత్రులు మాటల యుద్దానికి దిగారు. అయ్యన్న పాత్రుడు క్షమాపణలు చెప్పాలంటూ.. డిమాండ్‌ కూడా చేశారు వైసీపీ లీడర్లు.

అయితే.. ఈ నేపథ్యం లోనే తాజాగా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. కోడెల వర్దంతి సభ లో హోం మంత్రి పై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసన గా కేసు నమోదైంది. అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు న్యాయవాది వేముల ప్రసాద్. ఆయన ఫిర్యాదు తో… ఎస్సీ , ఎస్టీ అట్రాసిటి తో పాటు 505(2), 509, 294(B), సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు పోలీసులు.