గ్యాస్ సిలెండర్ సబ్సిడీపై కేంద్రం కొత్త ఆలోచన..!

-

వంట గ్యాస్ ధరలు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిజంగా దీని వలన చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏది ఏమైనా ఇలా ధరలు క్రమంగా పెరిగిపోవడం ఇక్కట్లు తప్పడం లేదు. ఇది ఇలా ఉంటే గ్యాస్ సిలెండర్ సబ్సిడీపై కేంద్రం ఇంకా ఏ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక దీని కోసం పూర్తిగా చూస్తే… సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల విషయం లో కేంద్రం ఇంకా స్పష్టమైన విధానం ప్రకటించ లేదు.

gas
gas

కానీ లబ్దిదారులకు ఈ సబ్సిడీని అందజేయాలనే యోచన లో కేంద్రం వుంది అని క్లియర్ గా తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం కేంద్రం వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల పై అందించే సబ్సిడీని నిలిపేసిన సంగతి తెలిసిందే. అయితే ఎంపిక చేసి కొన్ని వర్గాలకు సబ్సిడీని ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది.

ఇక ఎవరికి సబ్సిడీని ఇవ్వకూడదని అని భావించింది అనేది చూస్తే.. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 10 లక్షలు దాటిన వారికి సబ్సిడీని ఇవ్వకూడదని కేంద్రం భావిస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకో లేదు. ఇది ఇలా ఉండగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో వంట గ్యాస్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు అయితే వంట గ్యాస్ ధర రూ. 900 వరకు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news