ఈటల కుటుంబంపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు !

-

ఈటెల రాజేందర్ బావ మరిది జమునా రెడ్డి సోదరుడు కొండవీటి మధు సుధన్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు TSGCC చైర్మన్ ధారవత్ మోహన్ గాంధీ. కొండవీటి మధు సుధన్ రెడ్డి.. ఈటల పౌల్ట్రీ పార్టనర్ తో చేసిన ఫోన్ వాట్సప్ చాట్ లో దళితులను కించపరిచే ఉన్న వ్యాఖ్యలను ఖండిస్తూ డీజీపీకి TSGCC చైర్మన్ ధారవత్ మోహన్ గాంధీ ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ధారవత్ మోహన్ గాంధీ మాట్లాడుతూ.. దళితులను “మాదిగ నా కొడుకులను నమ్మలేము” అని తిడుతూ మెసేజ్ చేసిన మధుసుధన్ రెడ్డి ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈటల బామ్మర్ది అయిన మధుసూదన్ రెడ్డి దళితులను కించ పర్చే విధంగా సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు. ఈ వివాదంపై ఈటల రాజేందర్, ఈటల బామ్మర్ది క్షమాపణ చెప్పకపోతే దళిత వాడలకు ఓటు అడగడానికి వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈటల కుటుంబంపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టమని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news