పెరుగుతున్న టెక్నాలజీని ఈతరం వాళ్లు మంచికి వాడటం దేవుడెరుగు..చాలామంది చెడుకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ విషయం మనం డైలీ ఏదో ఒక సందర్భంలో వినే ఉంటాం. ఏ చిన్న డౌట్ ఉన్నా గూగుల్ చేయటం, యూట్యూబ్ లో చూడటం. యూట్యూబ్ లో అయితే ఇది లేదు అని ఉండదు..మనకు వచ్చే ప్రతిడౌట్ కి సొల్యూషూన్ యూట్యూబ్ లో ఉంటుంది. చూసి నేర్చుకుని ఎంతోకొంత మంచి విషయాలు నేర్చుకుంంటున్నారు. కానీ కొందరు చెడుకే వాడుతున్నారు.
తాజాగా ఓ 17 ఏళ్ల బాలుడు మోసాలు ఎలా చేయాలో యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాడు. ఏటీఎం సెంటర్స్ కు వచ్చే వృద్ధులను టార్గెట్ గా చేసుకున్నాడు. అలా ఇప్పటి వరకు రూ.10.52 లక్షలు కొట్టేశాడంట. చిత్తూరు జిల్లా పోలీసులు ఈ బాలుడ్ని అరెస్టు చేశారు. రూ.3 లక్షల విలువ గల బైక్, ఏటీఎం కార్డ్స్, రూ.65 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ బాలుడిది శ్రీకాకుళం జిల్లా సరిబుజ్జు గ్రామం. తల్లిదండ్రుల మాట వినకపోవటంతో విసుగుచెందిన పేరెంట్స్ ఆ బాలుడ్ని వదిలేశారు. అప్పటి నుంచి చెప్పేవాళ్లు లేక..చెడు అలవాట్లకు దగ్గరయ్యాడు. ఈజీగా మనీ సంపాదించాలని అనుకున్నాడు. దీని కోసం మోసాలు చేయటమే పనిగా పెట్టుకున్నాడు..యూట్యూబ్ లో చూసి మోసాలు ఎలా చేయాలో నేర్చుకుని ఏటీఎంల వద్దకు వృద్ధులు వస్తే డబ్బులు విత్ డ్రా చేస్తానని చెప్పి వారిదగ్గర నుంచి కార్డు తీసుకుని పిన్ నెంబర్ తెలుసుకుని.. నకిలీ ఏటీఎం కార్డు వారికి ఇచ్చేవాడు. అలా 2018 నుంచి ఏపీ, తెలంగాణలోని ప్రాంతాల్లో ఏటీఎం కార్డులతో మోసాలకు పాల్పడుతూ రూ.10.52 లక్షలు కాజేశాడు.
కాజేసిన డబ్బులతో ఈ కుర్రాడు జల్సా చేసేవాడు. విమానాల్లో తిరుగుతూ స్టార్ హోటళ్లలో బస చేసేవాడు. గతనెల చిత్తూరులో ఏటీఎం వద్ద ఓ వృద్ధురాలి ఏటీఎం కార్డు తీసుకుని పరారయ్యాడు. తర్వాత ఆమె అకౌంట్ నుంచి 70 వేల రూపాయలు విత్ డ్రా చేశాడు. వృద్ధురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ బాలుడిని తిరుపతి జువైనల్ హోమ్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు
ఇలా తప్పుచేస్తే ఏదో ఒకరోజు దొరికిపోవటం మాత్రం కాయం…తల్లిదండ్రులు వదిలేయటంతో ఈ బాలుడికి చివరకు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు యూట్యాబ్ లో ఇలాంటి కంటెంట్ కూడా బ్యాన్ చేయాలి.. ఒకప్పుడు పోర్న్ వీడియోసి పెట్టి యూవతను తప్పుదారి పట్టిస్తున్నారని బ్యాన్ చేశారు..ఇలాంటి మోసాలు ఎలా చేయాలో చెప్పే కంటెంట్ కూడా యూట్యూబ్ నుంచి తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు