యూపీఐ పిన్‌తో మోసాలు…తస్మాత్ జాగ్రత్తగా…!

-

ఈ మధ్య కాలం లో టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. దీనితో ఎక్కువ మంది ఆన్ లైన్ ట్రాన్సక్షన్స్ ఏ చేస్తున్నారు. పైగా ఇది అందరికీ ఎంతో సులభంగా ఉంటోంది. లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ కూడా ఎంతో ఈజీగా అయ్యిపోతున్నాయి. కానీ మోసాలు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి.

ఇలాంటి మోసాలు బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అకౌంట్ ఖాళీ అయ్యిపోతుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ మధ్య ఏటీఎం కార్డు మోసాలు, క్రెడిట్ కార్డ్ ఛీటింగ్స్ వంటివి ఎక్కువ జరుగుతున్నాయి. అలానే యూపీఐ మోసాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి మోసాలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల్ని అలర్ట్ చేస్తోంది.

ఇటువంటి వాటి వలన మోసపోకుండా ఉండాలని చెప్పింది. అలానే మోసగాళ్లు లాటరీ గెలుచుకున్నారని లింక్ పంపిస్తున్నారు. లింక్ క్లిక్ చేసి లాటరీ ద్వారా వచ్చిన మొత్తాన్ని పొందొచ్చని ముఖ్యమైన వివరాలని అడుగుతున్నారు.

అలానే యూపీఐ పిన్ ఎంటర్ చేయమంటున్నారు. వాటిని కనుక ఎంటర్ చేస్తే అకౌంట్‌లోని డబ్బుల్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. కనుక ఇలాంటి ఫేక్ మెసేజెస్ కి దూరంగా ఉండాలి. లేదంటే అంతే సంగతులు. మీరు ఎవరికైనా డబ్బులు పంపాలంటే యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి కానీ డబ్బులు రావాలంటే యూపీఐ పిన్ ఎంటర్ చెయ్యక్కర్లేదు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news