కరోనా వైరస్ నేపథ్యంలో తమ పిల్లలను స్కూళ్లకు ఎలా పంపాలా అని ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు కేంద్రం ఊరటనిచ్చే వార్త చెప్పింది. స్కూళ్లను ఇప్పుడప్పుడే ఓపెన్ చేసే అవకాశం లేదని, ప్రస్తుతం కేవలం ఎగ్జామ్స్ మాత్రమే నడుస్తాయని, ఆగస్టు తరువాతే స్కూళ్లను ఓపెన్ చేస్తామని తెలిపింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఈ విషయంపై స్పష్టతనిచ్చారు.
ఆగస్టు తరువాతే దేశంలో స్కూళ్లను ఓపెన్ చేస్తామని మంత్రి తెలిపారు. స్కూళ్లను ఎప్పటి నుంచి తెరుస్తారోనని దేశవ్యాప్తంగా 33 కోట్ల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో స్కూళ్లను ఓపెన్ చేశారని, కొన్ని చోట్ల జూలై నెల నుంచి స్కూళ్లను ఓపెన్ చేస్తారని.. వార్తలు వస్తున్నాయని.. అయితే ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు. ఆగస్టు తరువాత స్కూళ్లను ఓపెన్ చేసేందుకు ఆలోచిస్తున్నామని తెలిపారు.
ఇక అవకాశం ఉంటే ఆగస్టు 15 తరువాతే స్కూళ్లను తెరిచేందుకు ప్రణాళికలు రచిస్తామని స్పష్టం చేశారు. అప్పటి వరకు పరీక్షలు ముగిసి ఫలితాలు వస్తాయన్నారు.