చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపులు హడలెత్తిస్తున్నాయి. ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో 20కి పైగా ఏనుగులు గుంపులుగా ఊర్లపై దాడి చేస్తూ, పంటపొలాలను, పూల తోటలను నాశనం చేస్తున్నాయి. పైపాళ్యం, వెండిగాంపల్లి, పల్లార్లపల్లి, గంగాపురం గ్రామాల్లోకి చేరిన ఏనుగుల భయానికి ప్రజలు ఇళ్ళనుండి బయటికి రావడానికే భయపడుతున్నారు. అయితే ఇవి తమిళనాడు నుండి వస్తున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు.