ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ రీ ఓపెన్ పై ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఏపీలో నవంబర్ 2 నుంచి స్కూల్స్ రీ ఓపెన్ చేస్తున్నామని పేర్కొంది. రెండు రోజులకు ఒకసారి క్లాసులు నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. 1,3,5,7 క్లాసులకు ఒక రోజు ఉంటుంది అని పేర్కొంది. 2,4,6,8 కి మరో రోజు ఉంటుందని పేర్కొంది. 750 మంది విద్యార్ధులు ఉంటే మూడు రోజులకు ఒకసారి క్లాసులను నిర్వహిస్తామని సిఎం జగన్ చెప్పారు.
తల్లి తండ్రులు పిల్లలను స్కూల్స్ కి పంపకపోతే ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలి అని సిఎం జగన్ పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలు అవుతుందని ఆయన తెలిపారు. నవంబర్ లో ఒంటి పూట స్కూల్స్ ఉంటాయని అన్నారు. డిసెంబర్ లో స్కూల్ టైమింగ్ ని బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.