ఏపీలో నేటి నుంచి య‌థావిధిగా స్కూళ్లు ప్రారంభం

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో నేటి నుంచి య‌థావిధిగా స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి సెల‌వుల త‌రువాత ఏపీలో తిరిగి ఇవాళ విద్యాసంస్థ‌లు పునః ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తరహాలోనే సంక్రాంతి సెలవులను.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తగ్గిస్తారని ఉదయం నుంచి అందరూ భావించారు.

- Advertisement -

అయితే దీనికి పూర్తిగా విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. ఏపీలో విద్యా సంస్థలకు సెలవు లను పొడిగించే యోచనలో ప్రభుత్వం లేదని క్లారిటీ ఇచ్చారు మంత్రి ఆదిమూలపు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ జాగ్రత్తలు పాటిస్తూ విద్యాసంస్థలను నడిపిస్తామని పేర్కొన్నారు. యధావిధిగా సోమవారం నుంచి విద్యాసంస్థలు పున ప్రారంభం కానున్నట్లు ప్రకటన చేశారు. దీనిపై ఎలాంటి  వదంతులు నమ్మకూడదని సూచనలు చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్. దీంతో ఇవాళ్టి నుంచి ఏపీలో విద్యా సంస్థలు పునః ప్రారంభం కానున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...