పాలిచ్చే తల్లుల ఫొటోలు తీస్తే..2 ఏళ్ల జైలు శిక్ష !

-

అనుమతి లేకుండా పాలిచ్చే తల్లుల ఫోటోలను తీస్తే.. జైలుకు పంపేలా ఇంగ్లాండ్‌ కు చెందిన ఉన్నత న్యాయ స్థానం కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇటీవల కాలంలో మహిళలపై వేధింపులు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. పబ్లిక్‌ ప్లేసుల్లో పాలిస్తుంటే.. కొంత మంది దుర్మార్గులు తల్లుల ఫోటోలు తీసి… వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఈ విషయంలో ప్రభుత్వాలు పెద్దగా శిక్షలు అమలు చేయలేదు. యూకేకి చెందిన పార్లమెంట్‌ మెంబర్‌ స్టెల్లా క్రీసీ, పాపులర్‌ డిజైనర్‌ జులియా కూపర్‌ కూడా ఈ వేధింపులకు గురైనట్లు వెల్లడించారు.

ఓ సారి జులియా ఓ పార్క్‌ లో తన చంటి పాపకు పాలిస్తుండగా.. ఓ ఆకతాయి ఫోటో తీశాడు. ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే అది నేరం కిందకు రాదని కేసు నమోదు చేయలేదు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కోరుతూ స్టాప్‌ ది బ్రెస్ట్‌ పెస్ట్స్‌ పేరుతో తల్లులపై వేధింపులకు వ్యతిరేకంగా డిజిటల్‌ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఇకపై పాలిస్తున్న తల్లుల ఫోటోలను వారి అనునమతి లేకుండా కఠిన శిక్ష అమలు చేసేలా చట్ట సవరణ చేయబోతున్నట్లు ఇంగ్లాండ్‌ న్యాయస్థానం స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news