గత 8 నెలలుగా ప్రపంచం కరోనాతో నిజంగానే సహజీవనం చేస్తుంది. ఎప్పటికప్పుడు కరోనా గురించి వస్తున్న కొత్త సమాచారం ప్రజలను ఎంతగానో కంగారు పెడుతుంది. తాజాగా మరో కరోనా వైరస్ జాతిని మలేషియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇంతకుముందు గుర్తించిన జాతి కంటే 10 రెట్లు ఎక్కువ ప్రమాదకరమని శాస్త్రవేత్తలు గుర్తించారు. మలేషియాలో జరిపిన ఈ పరిశోధనల్లో ఈ విషయం వెల్లడి అయింది.
అయితే ఇది కొత్త జాతి కాదు అని కొందరు అంటున్నారు. ఇదే జాతి ఐరోపాలో గతంలో గుర్తించారు. ఇతర కరోనా వైరస్ జాతుల కన్నా కూడా ఇది అత్యంత ప్రమాదకరమని ఎక్కడా ఆధారాలు లేవు. మలేషియా డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ నూర్ హిషాం అబ్దుల్లా మాట్లాడుతూ ‘డి 614 జి’ అని దీనిని పిలుస్తున్నామని చెప్పారు. సూపర్ స్పైడర్ ల నుంచి ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు.