అంగారకుడి మీద జీవం ఉందని భావిస్తూ పలు దేశాలు ముమ్మరంగా పరిశోధనలు జరుపుతున్న సంగతి తెలిసిందే. అంగారకుడి మీద సాలీళ్లను పోలిన ఆకారాల ఫోటోలు చాలాకాలంగా ఓ మిస్టరీగా మారాయి. రాకాసి సాలీళ్లను తలపిస్తున్న ఆ ఆకారాలు అసలు జీవులేనా? అంటూ డబ్లిన్ లోని ట్రినిటీ కాలేజి పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. వారి పరిశోధనలో ఆసక్తికర వెలుగులోకి వచ్చాయి.
మచ్చలను తలపించేలా ఉన్న ఆ ఆకృతులు అంగారకుడి ఉపరితలంపై సీజన్లు మారే సమయంలో ఏర్పడి ఉంటాయని, మంచూలా ఉన్న కార్బన్ డయాక్సైడ్ నేరుగా వాయురూపంలో మారడం వల్ల ఏర్పడిన మచ్చలని తేలింది. అంగారకుడిపై కార్బన్ డయాక్సైడ్ వాయువు అత్యధికంగా ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల అవి గడ్డ కట్టుకు పోతాయి, మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు మళ్ళీ మునుపటి స్టేజ్ వి వస్తాయి, అలా ఆ విధంగా ఏర్పడే మచ్చల వంటి ఆకారాలు సాలీడు కాళ్లను తలపించేలా పొడవైన నిర్మాణాలు ఏర్పడ్డాయి అని కనుగొన్నారు.