కొత్త ర‌కం వ్యాధితో 10 మంది మృతి

-

కరోనా మహమ్మారి తో భారత దేశం అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో… ఉత్తర ప్రదేశ్లోని మధురలో మరో కొత్త వ్యాధి అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ఈ కొత్త రకం వ్యాధి బారినపడ్డారు చాలా మంది పిల్లలు. దీన్ని స్క్రబ్ టైఫస్ వ్యాధిగా వైద్యులు గుర్తించారు. తాజాగా మధుర జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రచన గుప్తా ఈ వ్యాధి పై మాట్లాడుతూ.. ఒక్క కొహు గ్రామంలోనే 26 మంది స్రబ్ టైఫస్ వ్యాధి బారిన పడ్డారని తెలిపారు. అలాగే పిత్రోత్ తో ముగ్గురు, రాల్ లో 14 మంది మరియు జసొడ లో 17 మందికి ఈ వ్యాధి సోకిన అన్నారు.

ఇక ఈ ప్రాంతంలో ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి 10 మంది మరణించగా ఇందులో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నట్లుగా నివేదికలు అందాయి అని ఆయన వివరించారు. ఉత్తరప్రదేశ్కు పశ్చిమంగా ఉన్న ఆగ్రా, ఫిరోజాబాద్, మెయిన్పురి, ఏటా, కస్ గంజ్ జిల్లాలో వ్యాధి సోకి మరణాలు కూడా సంభవించాయి అని ఆయన వెల్లడించారు. ఆయా ప్రాంతాల నుంచి అధికారులు నమూనాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఈ వ్యాధి సోకడం పై పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news