బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు.. వివరాలివే..!

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తాజాగా నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 190 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

bank-of-maharashtra
bank-of-maharashtrano

దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 19ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ. 1,180 చెల్లించాల్సి ఉంటుంది, PwBD, మహిళ అభ్యర్థులకు ఫీజు చెల్లింపులో మినహాయింపు ఇచ్చారు. ఆన్లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు. పోస్టు అర్హత చూసుకుని అప్లై చేసుకోండి. వేరు వేరు అర్హతలు వున్నాయి.

పోస్టుల వివరాలు:

అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్- 100
సెక్యూరిటీ ఆఫీసర్-10
లా ఆఫీసర్-10
హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్-10
ఐటీ సపోర్ట్ అడ్మినిస్ట్రేటర్- 30
DBA(MSSQL/Oracle)- 3
విండోస్ అడ్మినిస్ట్రేటర్-12
ప్రొడక్ట్ సపోర్ట్ ఇంజనీర్-3
నెట్వర్క్&సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్- 10
ఈమెయిల్ అడ్మినిస్ట్రేటర్- 2

ఇలా అప్లై చేసుకోండి:

ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ కోసం https://ibpsonline.ibps.in/bomrcpomay21/ లింక్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు కొత్త లింక్ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ మీ పేరు, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ తదితర వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
నెక్స్ట్ నంబర్, పాస్ వర్డ్ జనరేట్ అవుతుంది.
ఆ వివరాలతో లాగిన్ అయితే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ వివరాలను నమోదు చేసి అప్లై చేసుకోవాలి.
నోటిఫికేషన్: https://www.bankofmaharashtra.in/writereaddata/documentlibrary/eb99a900-aca8-4617-963e-2c55b7e950ad.pdf