బ్రేకింగ్ : గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటిఎం అవుట్…!

-

గూగుల్ తన ప్లే స్టోర్ నుండి డిజిటల్ చెల్లింపుల యాప్ అయిన పేటిఎమ్‌ను శుక్రవారం తొలగించింది. దానికి కారణం ఈ యాప్ వినియోగదారులను ఆన్‌ లైన్ లో గేమ్స్ ఆడటానికి ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. అలా ఇది స్పోర్ట్స్ బెట్టింగ్‌కు దోహద పడుతోందని చెబుతున్నారు. దాని కారణంగానే ఈ యాప్ ని ప్లే స్టోర్ నుండి తొలగించింది. ఈ రోజు, గూగుల్ ఇండియా తన బ్లాగులో భాగంగా దేశంలో ఈ ఆన్ లైన్ జూదం విధానాలకు వ్యతిరేకంగా తన కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక పేటీఎం యొక్క ప్రధాన యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించబడటం ఇదే మొదటిసారి.

అయితే పేటీఎం యాప్ ఒక్కటే తొలగించగా దీనికి అనుబంధంగా ఉన్న వెల్త్ మేనేజ్మెంట్ యాప్. పెటీఎం మనీ, పేటీఎం మర్చంట్, పేటీఎన్ బిజినెస్ లాంటివి ప్రస్తుతం ప్లే స్టోర్‌లో ఉంటాయి. “మా ఈ ఆన్ లైన్ గేమింగ్ విధానానికి మాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. మేము ఆన్‌లైన్ కాసినోలను అనుమతించము లేదా స్పోర్ట్స్ బెట్టింగ్‌ను సులభతరం చేసే క్రమబద్ధీకరించని ఇలాంటి యాప్స్ కి మద్దతు ఇవ్వము. డబ్బు లేదా నగదు బహుమతులు గెలవడానికి గాను టోర్నమెంట్లలో పాల్గొనడానికి అనుమతించే ఈ యాప్ మా విధానాల ఉల్లంఘన” అని గూగుల్ తన బ్లాగులో తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news