హెచ్‌డీఎఫ్‌సీకి ఝలక్…! కారణం ఏమిటంటే..?

-

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కి పెద్ద షాక్ తగిలింది. ఈ బ్యాంక్ కి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఝలక్ ఇచ్చింది. అలానే భారీ జరిమానా కూడా విధించడం జరిగింది. అయితే మరి దీనికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… బ్యాంక్ కస్టమర్ సెక్యూరిటీస్‌ను విక్రయించడానికి ప్రయత్నించడం దీనికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. దీనితో కోటి రూపాయల పెనాల్టీ విధించింది. ఇదే మొదటి సారి కాదు గతం లో కూడా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పై జరిమానా విధించిన విషయం తెలిసినదే.

ఇది ఇలా ఉండగా సెబీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎందుకు పెనాల్టీ వేసింది అనే విషయానికి వస్తే.. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సెక్యూరిటీలు విక్రయించడం లేదా కొనుగోలు చేయడం వంటివి చేయకూడదని సెబీ 2019 అక్టోబర్ నెల లో బీఆర్‌హెచ్ వెల్త్ క్రియేటర్స్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. కానీ ఈ ఉత్తర్వులను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉల్లంఘించింది. అందుకే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కి ఇది తప్ప లేదు.

కాగా ఇలాంటి సెక్యూరిటీలను విక్రయించడానికి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE నుంచి ముందుస్తు అనుమతి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాతే వీటిని విక్రయించుకోవడం వీలవుతుంది. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. దీని మూలం గానే ఇంత పెనాల్టీ కట్టాల్సి వస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news