సీతక్క ప్రత్యర్ధి చేంజ్..చెక్ పెట్టగలరా!

-

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీతక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని చెప్పొచ్చు…సీతక్క చేసే ప్రజా సేవ ఏంటో అందరికీ తెలుసు…ఆమె ప్రజల కోసం ఎంత దూరమైన వెళ్ళే వ్యక్తి అని తెలిసిందే. ఆపదలో ఉన్న వారికి అండగా ఉండటంలో సీతక్క ఎప్పుడు ముందే ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే ఇలా ప్రజల మనిషిగా ఉన్న సీతక్కకు రాజకీయంగా ప్రత్యర్ధులు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ రాజకీయ ప్రత్యర్ధులు సీతక్కకు చెక్ పెట్టాలని చూస్తున్నారు.

అయితే సీతక్కకు చెక్ పెట్టడమనేది అంత ఈజీనా అంటే…కాదనే చెప్పాలి..పూర్తి ప్రజా మద్ధతు ఉన్న సీతక్కని ఓడించడం చాలా కష్టమైన పని. ములుగు నియోజకవర్గంలో సీతక్కకు ప్రజల మద్ధతు ఎక్కువగా ఉంది. గతంలో టీడీపీలో ఉండగా ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్క..మళ్ళీ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

అలా కాంగ్రెస్ నుంచి గెలిచిన సీతక్క..ప్రజా సేవ చేస్తూ…ప్రజల మద్ధతు కూడబెట్టుకున్నారు. ఇక సీతక్కకు చెక్ పెట్టడానికి అధికార టీఆర్ఎస్ గట్టిగానే ప్రయత్నిస్తుంది…ఆమెపై బలమైన ప్రత్యర్ధిని నిలబెట్టేందుకు చూస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో సీతక్కపై..టీఆర్ఎస్ నుంచి అజ్మీరా చందులాల్ పోటీ చేసి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇక గతేడాది చందులాల్ అనారోగ్యంతో మరణించారు. దీంతో ములుగు టీఆర్ఎస్ సీటు కోసం పలువురు నేతలు ట్రై చేస్తున్నారు. మంత్రి చందూలాల్‌ మరణం తరువాత ములుగులో టీఆర్‌ఎ్‌సకు సరైన అభ్యర్థి లేకుండా పోయాయరు.

ఇదే క్రమంలో ములుగు జిల్లా డీఎంహెచ్‌వోగా పనిచేస్తున్న అల్లెం అప్పయ్య.. ములుగు అసెంబ్లీ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారని తెలిసింది. ఆదివాసీ కోయ సామాజికవర్గానికి చెందిన అప్పయ్య.. అధికార టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. అయితే పార్టీ ఉన్నతస్థాయి వర్గాలు కూడా ఆయనవైపు మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అప్పయ్య అయితేనే సీతక్కకు బలమైన ప్రత్యర్ధి అవుతారని భావిస్తున్నారట. చూడాలి మరి చివరికి సీతక్కకు టీఆర్ఎస్ చెక్ పెట్టగలదో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news