వాహనాల ట్యాంకులు ఫుల్ చేయించుకోండి… ఎన్నికల ఆఫర్ ముగిసింది: రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు

-

మరో రెండు రోజుల్లో 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియనున్నాయి. ఎన్నికల తర్వాత మళ్లీ పెట్రోల్, డిజిల్ రేట్లు పెరుగుతాయంటూ… వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా పెట్రోల్ రేట్ల పెరుగుదల గురించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా ‘‘ త్వరగా మీ వాహనాల ట్యాంకులు ఫుల్ చేయించుకోండి.. ఎన్నికల ఆఫర్ ముగిసింది’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. పెట్రోల్ బంక్ ఫోటోను షేర్ చేస్తూ కేంద్రాన్ని ఎద్దేవా చేశారు. 

ఈనెల 7తో ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగియనుంది. ఈనెల 10న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ప్రస్తుత పరిణామాల మధ్య పెట్రోల్ ధరలు మళ్లీ పెరుగుతాయని తెలుస్తోంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు చుక్కలను అంటుతున్నాయి. దీంతో ఎన్నికల తర్వాత పెంపు ఖచ్చితం అని అంటున్నారు. గతేడాది దీపావళికి ముందు కేంద్రం పెట్రోల్ పై రూ. 5, డిజిల్ పై రూ. 10 టాక్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీని తర్వాత పలు బీజేపీ, బీజేపీయేతర రాష్ట్రాలు కూడా రాష్ట్రాల పన్నులను తగ్గించుకున్నాయి. దీంతో పెట్రోల్ , డిజిల్ ధరలు తగ్గాయి. అప్పటి నుంచి పెట్రోల్ రేట్లు స్థిరంగానే ఉన్నాయి. తాజాగా అంతర్జాతీయ పరిణామాల మధ్య పెట్రల్ ధరలు రూ. 120-125 వరకు చేరే అవకాశం కనిపిస్తోంది. ఈనేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఈ ట్విట్ చేసినట్లు తెలుస్తోందిా.

Read more RELATED
Recommended to you

Latest news