హాట్ స్టార్ లో సీటిమార్..ఎప్పుడంటే..?

గోపీచంద్ తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా సీటిమార్. ఈ సినిమా సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలైంది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమాకు థియేటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా రిలీజ్ రోజున సినిమా సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడంతోపాటు పాజిటివ్ టాక్ రావడంతో 4 రోజుల క్రితం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే వినాయకచవితి సందర్భంగా థియేటర్లలో విడుదల చేసిన ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 15న ఓటీటీ లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతే కాకుండా హాట్ స్టార్ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు స్పష్టం చేసింది. ఇక థియేటర్లలో సినిమా మిస్ అయిన ఆడియన్స్ ఓటీటీలో ఈ చిత్రాన్ని చూడొచ్చు. దసరా సందర్భంగా విడుదల చేయడంతో ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమాను ఎంజాయ్ చేసే అవకాశం ఉంది.