నోబెల్ శాంతి బహుమతి ప్రకటన

-

నోబెల్ శాంతి బహుమతిని నార్వేయిన్ నోబెల్ కమిటీ ప్రకటించింది. ఈసారి ఇద్దరు పాత్రికేయులకు ఈ అవకాశం లభించింది. ఫిలిప్పిన్స్ దేశానికి చెందిన మారియా రెస్సా, రష్యా దేశానికి చెందిన దెమిత్రి మరటోవ్ కు 2021 నోబెల్ శాంతి బహుమతి లభించింది. రష్యా, ఫిలిప్పిన్స్ దేశాల్లో వాక్ స్వాతంత్య్రానికి కాపాడేందుకు చేసిన క్రుషికి గానూ వీరిద్దరికి నోబెల్ బహుమతి ఇచ్చినట్లు నోబెల్ కమిటీ చెప్పింది. విపరీత పరిస్థితుల్లో కూడా ప్రజాస్వామ్యం, స్వేచ్చ కోసం పని చేసినట్లు కమిటీ వెల్లడించింది. డిసెంబర్ 10న వీరిద్దరికీ నోబెల్ బహుమతి అందచేయనున్నారు. రెస్సా ఇన్వస్టికేషన్ జర్నలిస్ట్ గా రాప్లర్ అనే వెబ్ సైట్ ద్వారా విశేష సేవలు అందించింది. నోవియా గెజిట పేరు మీద మురుటోవ్ రష్యాలో పేపర్ స్థాపించారు.

Read more RELATED
Recommended to you

Latest news