జైభారత్‌ అంటూ జై షాకు సెహ్వాగ్‌ కౌంటర్‌

-

వరల్డ్ కప్ 2023లో తలపడబోయే భారత జట్టును.. బీసీసీఐ మంగళవారం(సెప్టెంబర్ 5) ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంపికైన 15 మంది పేర్లను వెల్లడిస్తూ.. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 కోసం ఎంపిక చేయబడిన టీమిండియా(#TeamIndia) స్క్వాడ్ ఇదిగో.. అని ట్వీట్ చేసింది. ఈ ప్రకటన వెలువడిన నిమిషాల వ్యవధిలోనే టీమిండియా మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.
సెహ్వాగ్ స్పందిస్తూ.. “టీమిండియా కాదు టీమ్ భారత్. ఈ వరల్డ్ కప్ లో మనం కోహ్లి, రోహిత్, బుమ్రా, జడేజాలాంటి వాళ్లను చీర్ చేస్తున్నప్పుడు మన గుండెల్లో భారత్ ఉండాలి. అంతేకాదు ప్లేయర్స్ భారత్ పేరున్న జెర్సీల వేసుకోవాలి” అంటూ బీసీసీఐ సెక్రటరీ జై షాను వీరూ ట్యాగ్ చేశాడు.

Virender Sehwag: జై షా గారూ.. ఇండియా కాదు భారత్ - Telugu MyKhel

ఇక మరో పోస్ట్ లో బ్రిటీష్ వాళ్లు ఇండియా పేరు ఇచ్చారని, మనం ఎప్పుడూ భారతీయులమే అని సెహ్వాగ్ అనడం విశేషం. “మనం గర్వపడే పేరు ఉండాలని నేను ఎప్పుడూ భావిస్తుంటాను. మనం భారతీయులం. ఇండియా అనే పేరును బ్రిటీష్ వాళ్లు ఇచ్చారు. చాలా కాలంగా ఈ పేరును మార్చి మళ్లీ మన భారత్ పేరును మార్చాల్సి ఉంది. వరల్డ్ కప్ లో మన ప్లేయర్స్ గుండెలపై భారత్ పేరున్న జెర్సీలు ధరించేలా చూడాలని నేను బీసీసీఐ,జై షాలను కోరుతున్నాను” అని సెహ్వాగ్ మరో పోస్ట్ లో అన్నాడు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news