మహేష్ అయితే ఒప్పుకోవాలా?.. సీనియర్ నటి కామెంట్స్

-

ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేని సీనియర్ నటి సుధ. అమ్మగా, అత్తగా, వదినగా, అక్కగా ఇలా ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే జీవించేయగల నటి. చిరంజీవి, బాలక‌ృష్ణ, నాగార్జున లాంటి సీనియర్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు అందరి పక్కన అమ్మగా నటించిన సుధా తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌ ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించింది.

తాను చిరంజీవి, నాగార్జున ఫ్యామిలీలతో చాలా క్లోజ్‌గా ఉంటానని అందులోనూ.. నాగ సుశీల, వెంకట్ వాళ్లతో మరింత దగ్గరగా ఉంటానని చెప్పుకొచ్చింది. మనోజ్ తనను మమ్మీ అని పిలుస్తాడని, మేజర్ చంద్రకాంత్ షూటింగ్‌లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంది. గ్యాంగ్ లీడర్ సినిమా షూటింగ్‌లో రామ్ చరణ్ చేసిన అల్లరి గురించి వివరించింది.

తాను ఓ క్యారెక్టర్ చేస్తే అందరూ గుర్తించాలని, ఓ వస్తువులా మూలన నిల్చునే పాత్రలను చేయనని చెప్పుకొచ్చింది. అందుకే మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాను వదులుకున్నానని తెలిపింది. అందులో రెండు రోజులే షూటింగ్.. రెండు నిమిషాలే పాత్ర ఉంటుందని చెప్పారు.. అందుకే తాను ఆ క్యారెక్టర్ పోషించనని చెప్పేశానని అంది. మహేష్ బాబు సినిమా అయితే ఒప్పుకోవాలా? మనసు చంపుకుని అలాంటి పాత్రలు చేయలేనని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version