సీనియర్‌ సిటిజన్స్‌కు ఏ ఖాతా మంచిది..?

-

ప్రస్తుత కాలంలో దేశీయంగా వడ్డీ రేట్లు తక్కువుగా ఉండటంతో ప్రజలకు, ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లకు ఇబ్బందిగా మారుతుంది. సీనియర్‌ సిటజన్లు పదవీ విరమణ తర్వాత మొత్తంలో పెట్టుబడిని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ) స్థిర ఆదాయ సాధనాలపై పెట్టుబడిగా పెడతారు. రెన్యువల్‌ సమయంలో రేట్లు పడిపోతే వారు వడ్డీ కోల్పోవాల్సి వస్తోది. అలాంటి వారికి పత్యామ్నాయాన్ని అందించడానికి, కొన్ని బ్యాంకులు ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ప్రారంభించాయి. ఇవి సాధారణ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్ల కంటే 30–80 బేసిస్‌ పాయింట్లను ఎక్కువుగా అందిస్తాయి.

వడ్డీ రేటు స్థిరంగా..

అయితే ఈ ఎఫ్‌డీలు అందించే వడ్డీ రేట్లు 6.20%– 6.30% వరకు ఉంటాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు ఏకంగా తన పొదుపు ఖాతా కస్టమర్లకు అధిక వడ్డీ రేటును (7%) అందిస్తుంది. నెలవారీ సగటు బ్యాలెన్స్‌ రూ. 25,000 మాత్రమే. పొదుపు ఖాతాల్లో ఉంచిన డబ్బుకు లాక్‌–ఇన్‌ ఉండదు, ఉపసంహరణలోనూ ఎలాటి ఫైన్‌ ఉండదు. అందువల్ల సీనియర్‌ సిటిజన్లు అకాల ఉపసంహరణపై లాక్‌–ఇన్, ఫైన్‌ కలిగి ఉన్న ఈ ప్రత్యేక ఎఫ్‌డీలలో పొదుపు చేయాలా లేదా అధిక వడ్డీ రేట్లను అందించే ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ వంటి పొదుపు బ్యాంకు ఖాతాల్లో డబ్బుని ఉంచాలా అనే సందేహాలు తలెత్తుతాయి, అయితే డబ్బును పొదుపు ఖాతాలో ఉంచినప్పుడు, బ్యాంక్‌ ముందస్తు నోటీస్‌ లేకుండా వడ్డీ రేటును మార్చదని గ్రహించాలి. ప్రత్యేక ఎఫ్‌డీల విషయంలో ఎఫ్‌డీ మొత్తం కాలపరిమితికి వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. ప్రస్తుతం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సాధారణ ప్రజలకు 5 ఏళ్ల ఎఫ్‌డీపై 5.4% వడ్డీ అందిస్తుంది. సీనియర్‌ సిటిజన్‌ ప్రత్యేక ఎఫ్‌డీ∙పథకం కింద ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పెడితే వడ్డీ రేటు 6.20%గా ఉంది.

ఐసీఐసీఐ గోల్డెన్‌ ఇయర్స్‌

సీనియర్‌ సిటిజన్స్‌ కోసం ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ గోల్డెన్‌ ఇయర్స్‌ అనే ప్రత్యేక ఎఫ్‌డీ పథకాన్ని ప్రారంభించింది. ఈ డిపాజిట్లపై సంవత్సరానికి 6.30% వడ్డీ రేటును అందిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ స్పెషల్‌ ఎఫ్‌డీ పథకంగా హెచ్‌డీఎఫ్‌సీ సీనియర్‌ సిటిజన్‌ కేర్‌ అనే స్కీమ్‌ను పారంభించింది. ఇందులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌కి 6.25% వడ్డీ రేటు ఇస్తుంది. ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కాలపరిమితి సాధారణంగా ఐదేళ్ల నుంచిప్రారంభమవుతుంది. ప్రత్యేక ఎఫ్‌డీల విషయంలో ఎఫ్‌డీ మొత్తం కాలపరిమితికి వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news