సీనియర్ హీరో చంద్ర మోహన్ లక్కీహ్యాండ్ రహస్యం.!

-

సీనియర్ హీరో చంద్ర మోహన్ అంటే ఇప్పటి తరానికి అంత తెలియదు. కాని అప్పట్లో ఎన్నో సినిమాలలో హీరోగా నటించారు. అలాగే అవకాశాలు తగ్గగానే వెంటనే తెలివిగా కారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుండే తన కెరీర్ స్టార్ట్ చేసారు. చంద్ర మోహన్ గారు 1966లో రంగులరాట్నం తో తెలుగు సినిమా పరిశ్రమ కు పరిచయం అయ్యారు.

ఇక హీరోలలో శోబన్ బాబు లాగా తనతో కూడా హీరోయిన్స్ బాగా క్లోజ్ గా వుంటారు.సిరిసిరి మువ్వ లో జయప్రద, పదహారే ళ్ల వయసులో శ్రీదేవి తమ నట జీవితం ప్రారంభంలో ఆయనతో నటించి అగ్రకథానాయికలుగా వెలిగారు. అప్పట్లో చాలా మంది హీరోయిన్స్ ఆయన సినిమా ద్వారా తెలుగు పరిశ్రమలో అడుగు పెడితే మంచి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు వస్తుందని భావించే వారు.ఎన్నో చిత్రాల్లో నటించిన ఆయన ప్రస్తుతం సినిమాల్లో నటించ కుండా, వృద్దాప్యం వల్ల శరీరం సహకరించక  విశ్రాంతి తీసుకుంటున్నారు.

తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన భార్య  ఆసక్తి కరమైన విషయం పంచుకున్నారు. “చంద్రమోహన్ హస్త వాసి మంచిదని అప్పటి హీరోయిన్స్ బాగా నమ్మే వారు. ఆయన సినిమాల్లో నటించడానికి పోటీ పడతారు అలాగే  ఆయన చేత్తో ఒక రూపాయి అయినా తీసుకునేవారు. ఇలా చాలా మంది హీరోయిన్స్ చేసే వారు.ఇప్పటికీ చాలా మంది హీరోయిన్లు, నటీ నటులు కూడా కొత్త సంవత్సరం తొలి రోజునే  ఇంటికి వచ్చి అలా డబ్బులు తీసుకుంటూ ఉంటారు” అని చెప్పుకొచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news