Thee Thalapathy : “వారసుడు” నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్..విజయ్ అదరగొట్టేశాడుగా

-

విజయ్ దళపతి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే.. ప్రస్తుతం “వారసుడు” అనే సినిమాతో మొదటిసారిగా డైరెక్టుగా తెలుగులో హీరోగా పరిచయం అవుతున్నారు విజయ్ దళపతి. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ్ భాషలలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో మొదటిసారిగా విజయ్ కి జోడిగా రష్మిక అలరించనుంది.


తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లుగా మూవీ యూనిట్ గతంలోనే ప్రకటించింది. అయితే, టాలీవుడ్‌ ఈ సినిమాను వ్యతిరేకించినా.. సంక్రాంతికే సినిమాను రిలీజ్‌ చేస్తామని మరోసారి దిల్‌ రాజ్‌ టీం ప్రకటించింది. అయితే, తాజాగా ఈ సినిమా సెకండ్‌ సింగిల్‌ ను రిలీజ్‌ చేశారు. Thee Thalapathy అంటూ సాగే ఈ పాటను శింబు పాడాడు. ఇక పాటలో బ్యాక్‌ గ్రౌండ్‌ అదిరిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news