టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ లో గుర్తింపు తెచ్చుకున్న నయనతార గత నాలుగు నెలల క్రితం జూన్ 9వ తేదీన తమిళ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను మహాబలేశ్వరంలో అతిరథ మహారధుల మధ్య వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వివాహం జరిగి నాలుగు నెలలు కూడా తిరగకుండానే ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు ఈ దంపతులు. అందులో ఇద్దరు మగపిల్లలే కాగా..ఈ సెలబ్రిటీ దంపతులు సరోగసి ద్వారా తల్లిదండ్రులయ్యారని ప్రచారం జరుగుతుంది. నిజానికి చాలామంది సెలబ్రిటీలు బిడ్డల్ని కనడం లేదు. సరోగసి ద్వారా, అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులు అవుతున్నారు. ఇక గతంలో కూడా చాలామంది సెలబ్రిటీలు ఇదే బాటలో పిల్లలను కన్న విషయం తెలిసిందే.
ఇప్పుడు నయనతార – విగ్నేష్ దంపతులు కూడా తాజాగా కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఈ విషయాన్ని వారే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.. అంతేకాదు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా.. తమ పిల్లలను ఆశీర్వదించాలని కూడా కోరారు. దీంతో పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు కూడా నయన్ – విగ్నేష్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ విషయంపై ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ కస్తూరి చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది..
ఇండియాలో సరోగసిపై బ్యాన్ ఉంది . వైద్య పరంగా అనివార్య కారణాల కోసం తప్ప సరోగసిని ప్రోత్సహించకూడదు . ఈ చట్టం జనవరి 2022 నుండి అమల్లోకి వచ్చింది. దీని గురించి మనం రాబోయే రోజుల్లో చాలా వినబోతున్నాము అంటూ చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం ఈమె ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేసింది అన్నది మాత్రం కస్తూరి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ నయనతార ఇలా తన కవల పిల్లలను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేయడంతో సరోగసి వెలుగులోకి వచ్చింది. దీన్ని బట్టి చూస్తే పరోక్షంగా నయనతారను ఉద్దేశించి కస్తూరి ఈ వ్యాఖ్యలు చేసిందని తెలుస్తోంది.
To all those telling me to mind my business,as someone who qualified to be a lawyer, I am certain legal analysis counts . And unlike the issue being discussed, my views are given completely altruistically , non commercially and after more than five years of being eligible.
— Kasturi Shankar (@KasthuriShankar) October 9, 2022