దారుణం.. ర్యాగింగ్ పేరిట 150 మంది విద్యార్థుల‌కు సీనియ‌ర్లు గుండు కొట్టించారు..!

-

పాఠ‌శాల స్థాయిని వీడి క‌ళాశాల‌ల‌కు వెళ్లే విద్యార్థుల‌కు స‌హ‌జంగానే ఎదుర‌య్యే భూతం.. ర్యాగింగ్.. ఈ ర‌క్క‌సి వ‌ల్ల ఎంతో మంది చ‌దువుకు గుడ్‌బై చెప్పిన సంద‌ర్భాలు ఉన్నాయి.

పాఠ‌శాల స్థాయిని వీడి క‌ళాశాల‌ల‌కు వెళ్లే విద్యార్థుల‌కు స‌హ‌జంగానే ఎదుర‌య్యే భూతం.. ర్యాగింగ్.. ఈ ర‌క్క‌సి వ‌ల్ల ఎంతో మంది చ‌దువుకు గుడ్‌బై చెప్పిన సంద‌ర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్‌, మెడిక‌ల్ కాలేజీల్లో జ‌రిగే ర్యాగింగ్ మ‌రింత వికృతంగా ఉంటుంది. సీనియ‌ర్లు జూనియ‌ర్ల‌పై ర్యాగింగ్ పేరిట నీచ‌మైన అకృత్యాల‌కు పాల్ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలోనే తాజాగా అలాంటి ఓ ఘ‌ట‌నే ఆ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని స‌ఫాయిలో ఉన్న ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీలో సీనియ‌ర్ విద్యార్థులు జూనియ‌ర్ స్టూడెంట్స్‌పై ర్యాగింగ్‌కు పాల్ప‌డ్డారు. వారిని అనేక విధాలుగా వేధించారు. అది కూడా స‌రిపోద‌ని చెప్పి ఆ విద్యార్థులంద‌రికీ గుండ్లు కొట్టించారు. మొత్తం 150 మంది జూనియ‌ర్ స్టూడెంట్స్‌కు సీనియ‌ర్ విద్యార్థుల గుండ్లు గీయించి కాలేజీ క్యాంప‌స్ మొత్తం తిప్పించారు. వారిచేత దండాలు పెట్టించుకున్నారు. ఈ క్ర‌మంలో ఆ విద్యార్థులు గుండ్ల‌తో కాలేజీకి వెళ్తున్న ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

కాగా ఈ విష‌యం తెలుసుకున్న ఆ కాలేజీ వైస్ చాన్స‌ల‌ర్ డాక్ట‌ర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. త‌మ కాలేజీలో ఇప్ప‌టికే ర్యాగింగ్‌ను నియంత్రించేందుకు ఓ క‌మిటీని ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. అయిన‌ప్ప‌టికీ ర్యాగింగ్‌కు పాల్ప‌డిన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు. బాధిత విద్యార్థులతోపాటు ఇత‌ర జూనియ‌ర్ విద్యార్థులు ఈ విష‌యంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవ‌ద్ద‌ని, వారు ర్యాగింగ్ బారిన ప‌డితే వెంట‌నే ర్యాగింగ్ క‌మిటీని ఫిర్యాదు చేయాల‌ని ఆయ‌న తెలిపారు. కాగా సోష‌ల్ మీడియాలో ఈ వార్త ఇప్పుడు సంచ‌ల‌న‌మే క‌లిగిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version