వచ్చే ఎన్నికల్లో జగన్‌ ప్రభుత్వం ఓడిపోతుంది – మేకపాటి

-

 

అనిల్ కుమార్ యాదవ్ ను వచ్చే ఎన్నికల్లో గెలువనివ్వనని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు వై.సి.పి నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారని ఎమ్మేల్యే అనిల్ కుమార్ యాదవ్ చెప్పడం చాలా బాధాకరమన్నారు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. అనిల్ నువ్వు ఓడిపోతున్నావు ..ముందు అది చూసుకో..నీకు నోరు ఉందనే సీఎం మంత్రి పదవి నీకు ఇచ్చాడని ఆగ్రహించారు.

మేము ముగ్గురము నూటికి నూరుపాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలుస్తాము, రాబోయే ఎన్నికల్లో మీరే చూస్తారు కదా..పార్టీ భ్రమలో మీరు మాట్లాడుతున్నారన్నారు. కచ్చితంగా ప్రభుత్వం మారుతుంది, వైసిపి ఓడిపోతుందని బాంబ్‌ పేల్చాడు. పోయిన ఎన్నికల్లో సింగిల్ డిజిట్ తో అనిల్ గెలిచాడు.. అది మర్చిపోయినట్లుగా ఉన్నారు… కాస్త గుర్తుంచుకోండని చురకలు అంటించారు. మమ్మల్ని సస్పెండ్ చేశారు, నీకు పార్టీ టికెట్టు ఇవ్వరని ప్రచారం జరుగుతోంది.. నీది…నువ్వు చూసుకో ముందు అంటూ సెటైర్లు వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగానే ఓటు వేశాను..రాబోయే ఎన్నికల్లో పార్టీ టికెట్ నాకు ఇవ్వనని జగన్ చెప్పారు.. వేరే వ్యక్తికి ఇస్తున్నాము అతనికి మద్దతు తెలపాలని అన్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news