తన కంటే పొడవైన జుట్టు ఉన్న మహిళ సంచలన కామెంట్స్..!

-

పొడవాటి జుట్టును ఇష్టపడని వారంటూ ఉండరు. మన హిందూ సంప్రదాయంలో జుట్టుకు చాల ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక చాల మంది జుట్టు పెరుగుతుందంటే చాలు దానికోసం చాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతేకాక ఎంత ఖర్చు చేసైనా కొత్తకొత్త ప్రొడక్ట్స్ వాడటానికి అయినా సిద్ధంగా ఉంటారు. అమ్మాయిలకు జుట్టు అంటే అంత ఇష్టం మరి. తాజగా జపాన్‌కు చెందిన ఓ యువత తన కంటే పొడవైన జుట్టు గురించి ఆ పొడవైన జుట్టు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

rapunzel
rapunzel

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జపాన్ రాజధాని టోక్యోకు చెందిన రిన్‌ కంబే మోడల్ కమ్ డ్యాన్సర్‌. అయితే రిన్‌కు వృత్తి పరమైన గుర్తింపు కంటే పొడవైన నల్లటి జుత్తువలన వచ్చిన గుర్తింపు ఎక్కువని.. తన శిరోజాలే తనకు మంది పేరు తెచ్చిపెట్టాయని వెల్లడించింది. అందుకనే తన జుట్టును గత 15 ఏళ్ల నుంచి కట్ చేయడం లేదని తెలిపింది.

అయితే రిన్ కంబే శిరోజాల పొడవు అక్షరాలా ఆరు అడుగుల మూడు అంగుళాలు ఉంది. ఇక గత 15 ఏళ్లనుంచి కట్ చేయని తన జుట్టును చూసుకుంటూ మురిసిపోతుంది. అంతేకాదు తన జుట్టు తనకు భావ వ్యక్తీకరణకు బలమైన ఆయుధం అని గర్వంగా చెబుతుంది. అమ్మాయికి జుట్టు ఎంత అందాన్ని ఇస్తుందో దెయ్యం జుట్టు అని టీజ్ చేస్తున్నవారికి ఏమి తెలుసు అని ప్రశ్నిస్తుంది.

ఇక జుట్టు ఇంత ఒత్తుగా పొడవుగా నల్లగా పెరగడానికి రిన్ రోజు ఎంత కష్టపడుతుందో కూడా చెప్పింది. జుట్టు ఆరోగ్యంగా అందంగా పెరగడానికి ప్రత్యేకంగా కుంకుమ పువ్వుతో తయారు చేసిన స్కాల్స్ క్రీమ్‌ను రాసుకుంటానని తెలిపింది, అంతేకాదు తినే ఆహారంలో జుట్టుకు సంబంధించిన పోషక పదార్ధాలు ఉండేలా చూసుకుంటానని.. ఐరెన్, కాల్షియం వంటివి ఉండేలా జాగ్రత్తపడతానని తెలిపింది.

కానీ.. 35 ఏళ్ల రిన్ కంబే 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బౌద్ధమతాన్ని స్వీకరించినట్లు తెలిపింది. ఇక అప్పటి నుంచి ఇక తన జుట్టును కట్ చేయడం మానేశారట. అప్పటి నుంచి జుట్టు బాగా పెరగడం గమనించిన రిన్ దానికి పోషకాలు అందేలా సంరక్షణ చర్యలు తీసుకున్నారు. ఇప్పడు ఆమె జుట్టుకు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news