ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ్ ఆలయం నిర్మాణానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. రాముడు ఏ మతానికి చెందిన వాడు కాదు అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. కేంద్ర మంత్రి, బిజెపి నేత, రామాలయ ఉద్యమ నేతల్లో ఒకరైన ఉమా భారతి, అయోధ్య ట్రస్ట్ బోర్డుకు ఓబిసి ఉండాలని చెప్పిన తర్వాత ఆయన ఈవ్యాఖ్యలు చేసారు.
“రాముడు ఏ సమాజానికి చెందినవాడు కాదు, ఉమా భారతి మరియు చాలా మంది బోర్డులో ఓబిసి ప్రాతినిధ్యం గురించి మాట్లాడారు, కానీ అది సాధ్యం కాదు” అని సురేంద్ర జైన్ అన్నారు రాముడి ఆలయం కోసం సాధువులు, పౌరులు, త్యాగాలు చేసిన నాయకులు అందరూ ఆసక్తిగా ఉన్నారని అన్నారు. ఈ ఆలయ నిర్మాణానికి ఖచ్చితమైన ఎంత సమయం పడుతుందో చెప్పలేమన్నారు.
అయితే 3-4 సంవత్సరాలలో ఒక గొప్ప రామ్ ఆలయాన్ని సందర్శించగలుగుతారన్నారు. ఇదిలా ఉండగా, అయోధ్యలో గురువారం మహంత్ నృత్య గోపాల్ దాస్, చంపత్ రాయ్ సహా సాధువులు ఒక సమావేశాన్ని నిర్వహించారు, అక్కడ ట్రస్ట్ బోర్డులో సాధువుల పేరును చేర్చకపోవడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేసారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో తమకు పేరు పెట్టారు, కాని ట్రస్ట్ బోర్డులో కాదని ఆవేదన వ్యక్తం చేసారు. ట్రస్ట్ బోర్డు లో మరో రెండు ఇద్దరు వ్యక్తులకు స్థానం ఉన్న సంగతి తెలిసిందే.